Monday, May 20
కేన్స్ లో అలా… ఇక్కడ హెబ్బా ఇలా…

కేన్స్ లో అలా… ఇక్కడ హెబ్బా ఇలా…

AP &Telangana, CINEMA, HOROSCOPE, local, National, viral videos
కేన్స్ లో అలా... ఇక్కడ హెబ్బా ఇలా... కొత్త కొత్త అందాలను చూడాలంటె కేన్స్ వెళ్లాల్సిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది నటీమణులు తమ అందాలను అందమైన డ్రెస్ లను అక్కడ ప్రదర్శిస్తుంటారు. కేవలం అక్కడికి వచ్చే గ్లామర్ హీరోయిన్లను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. ఫెస్టివల్ ను బేస్ చేసుకొని కోట్లాది రూపాయల సినీ బిజినెస్ జరుగుతుంది. పనిలో పనిగా సినిమాల ప్రమోషన్స్ కూడా జరుపుతుంటారు. ఈ ఏడాది జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఇండియా నుంచి దీపికా, ప్రియాంక, కంగనా, డయానా, హుమా, ఐశ్వర్య రాయ్ తదితరులు పాల్గొన్నారు. కేన్స్ లో మన హీరోయిన్లు వారి గ్లామర్ ను ప్రదర్శిస్తే.. లోకల్ గా ఇక్కడ హెబ్బా పటేల్ గ్లామర్ షో తో ఆకట్టుకుంది. లాంగ్ బ్రౌన్ కలర్ స్లీవ్ గౌన్ తో అదరగొట్టింది. మంచంపై కూర్చొని గౌన్ ఫోటోలు దిగింది. నెక్ లెస్ స్లీవ్ గౌన్ కావడంతో... అందాల ప్రదర్శన ఆటోమాటిక్ గా జరిగిపోయింది. కుమారితో

గుడ్‌న్యూస్‌.. కోలుకున్న కేదార్‌ జాదవ్‌

గుడ్‌న్యూస్‌.. కోలుకున్న కేదార్‌ జాదవ్‌

Business, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Sports, viral videos
గుడ్‌న్యూస్‌.. కోలుకున్న కేదార్‌ జాదవ్‌ టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. గాయంతో ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ కోలుకున్నాడు. జాదవ్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించిన టీమిండియా ఫిజియో పాట్రిక్‌... అతను ఫుల్లీ ఫిట్‌ అని ప్రకటించాడు. ఈక్రమంలో ఈనెల 22వ తేదీన జట్టు సభ్యులతో కలిసి జాదవ్‌ కూడా ఇంగ్లండ్‌ బయలుదేరుతాడు. ఒకవేళ మే 22వ తేదీ నాటికి జాదవ్‌ కోలుకోకపోతే అంబటి రాయుడు లేదా అక్షర్‌ పటేల్‌కు ఛాన్స్‌ వస్తుందని భావించారు.

హాజీపూర్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్..

హాజీపూర్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్..

AP &Telangana, CINEMA, Health, HOROSCOPE, local, National, viral videos
హాజీపూర్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ గ్రామంలో దీక్షకు దిగిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు... అమ్మాయిలను చంపి శ్రీనివాస్‌రెడ్డి పాతిపెట్టిన బావిలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడుతూ.. ఇక తమకు న్యాయం జరగదని తమ పిల్లలు చనిపోయిన బావిలోనే తామూ చనిపోతామంటూ నలుగురు యువకులు బావిలో ఆందోళన చేపట్టారు. దీంతో బావి దగ్గరకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీసేవరకు పోరాటం చేద్దాం... మీరు బయటకు రండి అంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేయడంతో.. ఆ నలుగురు యువకులు బావి నుంచి బయటకు వచ్చారు. పోలీసులు గ్రామస్తుల దీక్షను భగ్నం చేసినా.. హాజీపూర్‌లో

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు సారీ చెప్పిన రాశీ ఖన్నా

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు సారీ చెప్పిన రాశీ ఖన్నా

AP &Telangana, CINEMA, HOROSCOPE, local, National, viral videos
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు సారీ చెప్పిన రాశీ ఖన్నా హైదరాబాద్‌: ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కి సినీ నటి రాశీ ఖన్నా క్షమాపణలు చెప్పారు. ఆమె కథానాయికగా విశాల్‌కు జోడీగా నటించిన ‘అయోగ్య’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్‌ చెప్పారు. అయితే సినిమా క్రెడిట్స్‌లో రవీనా పేరును జోడించలేదు. దాంతో ట్విటర్‌ వేదికగా రవీనా తన బాధను వ్యక్తపరిచారు. ‘అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదు. షూటింగ్‌లో ఉన్న డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్‌ ఇంజినీర్లు, స్టూడియో కో-ఆర్డినేటర్‌ల పేర్లు క్రెడిట్స్‌లో పేర్కొన్నందుకు సంతోషంగా ఉంది. కానీ మా కేటగిరీ (డబ్బింగ్‌)ని పట్టించుకోనందుకు బాధగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు రాశీ ఖన్నా స్పందిస్తూ.. ‘గుర్తించనందుకు సారీ రవీనా. కానీ, నీ మధురమైన స్వరాన్ని అరువిచ

గాడ్సే వివాదంపై గుత్తా జ్వాల ట్వీట్‌

గాడ్సే వివాదంపై గుత్తా జ్వాల ట్వీట్‌

AP &Telangana, Business, Crime, Education, HOROSCOPE, local, National, Politics
గాడ్సే వివాదంపై గుత్తా జ్వాల ట్వీట్‌ మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ చేసిన వ్యాఖ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె వ్యాఖ్యలను రంగాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. గాడ్సేను ప్రశంసించడంపై బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల కూడా విస్మయం వ్యక్తం చేసింది. 'గాడ్సేకు కూడా అభిమాన సంఘం ఉందని ఇంత వరకూ తెలియదు..! గాడ్సేకు కూడా మద్దతు లభిస్తుందని అనుకోలేదు. గాడ్సేను ప్రశంసించడమంటే చరిత్రను నమ్మొద్దని చెప్పడమే. ఇటువంటి వ్యాఖ్యలు చాలా భయాంకరమైనవి' అని అంటూ జ్వాల ట్వీట్‌ చేశారు. https://twitter.com/Guttajwala/status/1129613397052366849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1129613397052366849&ref_url=https%3A%2F%2Fwww.ntvtelugu.com%2Fpost%2Fgutha-jwala-tweet-on-gadse-issue

వైరల్ వీడియో: బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్

వైరల్ వీడియో: బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్

Business, Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
వైరల్ వీడియో: బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలో 'మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్' బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటానికి స్థానిక టీవీ వార్తల్లో చూపించారు. https://youtu.be/CZSOdkvYoCo మొబైల్ లో చిత్రీకరించిన దృశ్యాలు, వీడియోల్లో విమానం వెనక భాగం వెనక్కి తిరిగి కనిపించింది. కార్డు బోర్డు బాక్సులు చెల్లాచెదురై కనిపిస్తున్నాయి. విమానం వస్తున్న పోతున్న శబ్దాలు వినిపించాయని, ప్రమాదానికి ముందు మాత్రం పెద్ద శబ్దం వచ్చిందని గోదాములో పనిచేసే వారిలో ఒక కార్మికుడైన డేనియల్ గాలోగోస్ తెలిపారు.

అక్షయ్ లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్

అక్షయ్ లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, National, viral videos
అక్షయ్ లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్ బాలీవుడ్ లో వివిధ రకాలైన ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. కమర్షియల్ సినిమాలతో పాటు అన్ని రకాల ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాల్లో నటించి మెప్పించే తత్త్వం కలిగిన నటుడు అక్షయ్. వరసగా పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూనే... కథ నచ్చితే చిన్న దర్శకులతో కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంటాడు అక్షయ్. టాలీవుడ్, కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లారెన్స్ రాఘవ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఫాక్స్ స్టార్ ఇండియా నిర్మాణంలో లక్ష్మి బాంబ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్ రాఘవ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా జూన్ 5, 2020 న రిలీజ్ అవుతుందట.

వరుణ్ తేజ్ వాల్మీకి నుంచి మరో ట్విస్ట్

వరుణ్ తేజ్ వాల్మీకి నుంచి మరో ట్విస్ట్

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, National, Politics
వరుణ్ తేజ్ వాల్మీకి నుంచి మరో ట్విస్ట్ ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా వాల్మీకి. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి మెగా హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్. బాబీ సింహా చేసిన పాత్రను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తోంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు. అయితే, పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో కొన్ని పట్టింపులు రావడంతో పూజా పక్కకు తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి. మరో ట్విస్ట్ ఏమంటే మ్యూజిక్ డైరెక్టర్. మొదట దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వలన దేవిశ్రీని పక్కన పెట్టి మిక్కీ జె మేయర్ ను లైన్లోకి తీసుకొచ్చారు. తమిళ

ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య..

ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య..

AP &Telangana, Crime, HOROSCOPE, local, National, Politics, viral videos
ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య.. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులో మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించారు... ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో దుశ్చర్యకు పాల్పడ్డారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పరిధిలోని తేమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో పంచాయతీ కార్యాలయం గోడలు పడిపోగా... కార్యాలయంలోని ఫర్నీచర్, బీరువాలు చెల్లాచెదరయ్యాయి. కొంత సామగ్రి కాలిబూడిదైంది. మరోవైపు అలర్ట్ అయిన ఆంధ్ర-ఒడిశా పోలీసులు.. మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

‘ఐఆర్‌సీటీసీ’కి ఇవాళ రాత్రి నుంచి బ్రేక్‌

‘ఐఆర్‌సీటీసీ’కి ఇవాళ రాత్రి నుంచి బ్రేక్‌

AP &Telangana, Business, HOROSCOPE, local, National, Technology, viral videos
'ఐఆర్‌సీటీసీ'కి ఇవాళ రాత్రి నుంచి బ్రేక్‌ ఐఎస్‌సీటీసీలో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే.. ఇప్పుడే ఆ పని కానిచ్చేయండి. ఎందుకంటే.. ఇవళ అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఈ యాప్‌, వెబ్‌సైట్‌కు అంతరాయం కలగనుంది. మెయింటినెన్స్‌ కారణంగా ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు, ఢిల్లీలో ఇవాళ రాత్రి 11:45 నుంచి రేపు ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. మరింత సమాచారం కోసం 0755-6610661, 0755-4090600, 0755-3934141 కస‍్టమర్‌ కేర్‌ నంబర్లు లేదా eticket@irctc.co.in మెయిల్‌ ఐడీని సంప్రదింవచ్చని సూచించింది.