Thursday, October 24

ఇది బన్నీ ఫాల్కన్‌

ఇది బన్నీ ఫాల్కన్‌

సినిమా తారలు చిత్రీకరణల కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటారు. వెళ్లిన ప్రతి చోటా వాళ్లు సేద తీరడానికి తగిన వసతులు ఉండవు. అందుకే తారల కోసం నిర్మాతలు సెట్‌లో ప్రత్యేకంగా వ్యానిటీ వ్యాన్లని సమకూర్చుతుంటారు. పని పూర్తవ్వగానే వ్యానిటీ వ్యాన్లలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటారు తారలు. అయితే ఇటీవల తారలు వాళ్ల స్థాయికి, అభిరుచులకి తగ్గట్టుగా ప్రత్యేకమైన హంగులతో సొంతంగానే వ్యానిటీ వ్యాన్లని సిద్ధం చేయించుకొంటున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు పెడుతుంటారు. వాళ్ల ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలుంటాయో, అంతకుమించిన హంగులతో వ్యానిటీ వ్యాన్లు సిద్ధం అవుతున్నాయి. అందులో పడక గదులు మొదలుకొని… మేకప్‌, విశ్రాంతి, భోజనాల గదుల వరకు అన్నీ ఉంటాయి. తెలుగులో అగ్ర కథానాయకులందరికీ అలాంటి సొంత వాహనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ ఇటీవల మరో ఖరీదైన వ్యానిటీ వాహనాన్ని కొని, దాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. దానికి ఫాల్కన్‌ అని పేరు పెట్టారు. ఫాల్కన్‌ అంటే డేగ అని అర్థం. ఆ వాహనానికి సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొన్నారు అల్లు అర్జున్‌.

‘‘నేను నా జీవితంలో ప్రతిసారీ పెద్దదే కొన్నాను. ఆ సమయంలో నా మనసులో ఒకటే ఆలోచన. ప్రజలు నాపై చాలా ప్రేమని కురిపించారు. వాళ్ల ప్రేమకున్నశక్తి వల్లే నేను ఇవన్నీ కొనగలుగుతున్నానని. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. దీనికి ఫాల్కన్‌ అనే పేరు పెట్టా’’ అని ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్‌. రెడ్డి కస్టమ్స్‌ అనే సంస్థ ఈ వాహనాన్ని డిజైన్‌ చేసింది. ఆ సంస్థకి కృతజ్ఞతలు చెప్పారు అల్లు అర్జున్‌. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వ్యానిటీ వ్యాన్‌ ఖరీదు రూ.7 కోట్లు అని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *