Sunday, July 25

భార్యతో కలిసి జూ.ఎన్టీఆర్‌ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టేసిన డేవిడ్ వార్నర్


ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్
డ్యాన్స్ వేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తోన్న వార్నర్ డ్యాన్స్
అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టగా ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు.

ఆ‌ దంపతులు ఇప్పుడు నేను పక్కా లోకల్ పాటకు డ్యాన్ చేశారు. ఎన్టీఆర్‌ నటించిన ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ‘పక్కా లోకల్‌.. నేను పక్కా లోకల్‌’ అంటూ తారక్‌తో కలిసి కాజల్‌ అగర్వాల్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. అచ్చం వారిలా డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ తారక్ అభిమానులను అలరిస్తోంది. ‘హ్యాపీ బర్త్‌ డే జూనియర్ ఎన్టీఆర్‌.. గ్రేట్ డే’ అంటూ ఆయన ఎన్టీఆర్‌కు ఈ గిఫ్టును అందించారు.  
https://www.instagram.com/p/CAZmL8HJ4xR/