Friday, November 26

స్నేహితుడి భార్య కిడ్నాప్….ఆపై అత్యాచారం

స్నేహితుడి భార్యపై కన్నేసిన కామాంధుడు..వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు ఆసరాగా చేసుకున్నాడు. స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి ఆమె పై అత్యాచారం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉండే పల్లి నాని బాబు , బూర్లి
హేమసుందర్ స్నేహితులు. వీరిద్దరూ కారు డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

హేమసుందర్ కు అతడి భార్యకు మనస్పర్ధలు రావటంతో, మే9న భార్యను ఆమె పుట్టిల్లైన
ద్వారకా తిరుమలలో దింపి వచ్చాడు. అప్పటి నుంచి హేమ సుందర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. హేమ సుందర్ భార్యను పుట్టింట్లో దింపి రావటం నానిబాబు గమనించాడు. అప్పటికే హేమసుందర్ భార్యపై కన్నేసిన నానిబాబు ఆమెను అనుభవించటానికి…అవకాశం కోసం
ఎదురు చూడసాగాడు.

మే 11 వతేదీన పధకం ప్రకారం హేమ సుందర్ భార్యకు ఫోన్ చేసి తను కిరాయికి భోమడోలు వచ్చానని, లాక్ డౌన్ కారణంగా వాహనాలు తిరగటం లేదు కనుక..మీ ఆయన నిన్ను తీసుకురమ్మన్నాడని నమ్మించాడు. నాని బాబు, మరో కారు డ్రైవర్ వాసాది కాశీ లు ఇద్దరూ ఆమెను కారులో ఎక్కించుకుని ఏలూరు తీసుకు వచ్చారు. అక్కడ ఆమెను ఒక గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈలోగా హేమ సుందర్ నానిబాబు రూం వద్దకు వెళ్లగా అక్కడ అతడ్ని కూడా
నాని బాబు,కాశీలు తీవ్రంగా గాయపరిచారు. హేమ సుందర్ జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పటంతో వారంతా నాని బాబును నిలదీయటంతో హేమ సుందర్ భార్యను పంపించివేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేసిన పోలీసులు నాని బాబును, కాశీలను అరెస్ట్ చేశారు.