Thursday, October 14

టీవీ షో లో యాంకర్ గా ఇలియానా

ఇలియానా… తెలుగు యూత్ ను ఒకప్పుడు తన అంద చందాలతో కట్టి పడేసిన గోవా బ్యూటీ.
దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తరువాత పోకిరి సినిమాతో ఇండస్ట్రి హిట్ కొట్టి అగ్ర కధానాయకగా తెలుగులో చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు మాత్రం ఆఫర్ లు లేక వెండితెరకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎంత అందం ఉన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని అందుకే అన్నారు, ఇల్లు ఏంటి అన్నీ చక్కబెట్టుకున్న
ఇలియానాకు ఇప్పుడు ఛాన్స్ లు లేకపోవడం వింతేమి కాదు అనుకోండి… ఎంకుకంటే వచ్చే కొత్త హీరోయిన్ ల పోటీకి తట్టుకుని ఒక హీరోయిన్ నిలబడటం అంటే అది 5 సంవత్సరాలు కాలం మాత్రమే. అంత షార్ట్ స్పాన్ లో కూడా ఇలియానా తెలుగు, తమిళ్, హింది బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హిందీలో ఒక చానల్ లో యాంకర్ గా కనిపించనుందట, హీరోయిన్ గా హైట్స్ చూసిన ఇలియానా ఇప్పుడు బుల్లితెర పై ఎలా
రాణిస్తుందో చూడాలి.