Thursday, November 25

పర్మిట్ ఫీజులు రోడ్ టాక్స్ లు రద్దు చెయ్యాలి | పవన్ కల్యాణ్

కరోనా కారణంగా గత 3 నెలలుగా ఆగిపోయిన టాక్సీలు నడుపుకుంటు జీవించే వారు తీవ్ర నష్ట్రాల్లో ఉన్నారని, కాగా లాక్ డౌన్ ఉన్నంత కాలం జన జీవనం స్తంబించడంతో అద్దెకు వాహనాలు తిప్పే పరిస్తితి లేదు. సడలించిన తరువాత కూడా ఉపాది సరిగా లేదు. ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా టాక్సీలకు, రోడ్ టాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని రవాణా శాఖ ఒత్తిడి చెయ్యడం భావ్యం కాదు. కాగా జనసేన పార్టీ వద్దకు వచ్చి తమ గోడు తెలియచేసారని, దీనిని మానవతా దృక్పదంతో చూడాలని, ఈ మేరకు రోడ్లపై తిరగని వాహనాలకు లాక్ డౌన్ సమయంలో పర్మిట్ ఫీజ్, రోడ్ టాక్స్ రద్దు చేయాలని, అలాగే సీట్ల కుదింపు ఉన్నంత వరకు 50% రాయితీ ఇవ్వాలని, అదే విదంగా మాక్సీ టాక్సీ క్యాబ్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాలను ఆర్ధికంగా ఆడుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.