Wednesday, May 18

కరోనా కాటుకు గురయ్యా.. టెన్నిస్ స్టార్ డిమిత్రొవ్

తనకు కరోనా పాజిటివ్ సోకిందని బల్గెరియన్ టెన్నిస్ స్టార్ గ్రిగోర్ డిమిత్రొవ్ వెల్లడించాడు. ఇందుకు తన అభిమానులను ఉద్దేశించి సో…సారీ అని ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితమే ఈ ప్లేయర్..

తనకు కరోనా పాజిటివ్ సోకిందని బల్గెరియన్ టెన్నిస్ స్టార్ గ్రిగోర్ డిమిత్రొవ్ వెల్లడించాడు. ఇందుకు తన అభిమానులను ఉద్దేశించి సో…సారీ అని ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితమే ఈ ప్లేయర్.. ఓ ఎగ్జిబిషన్ టోర్నమెంట్ లో వరల్డ్ నెం.1 నొవాక్ జొకోవిచ్ తో కలిసి ఆడాడు. మొరాకోలో జరిగిన ఈ పోటీల్లో తాను పాల్గొన్నట్టు స్పష్టం చేసిన డిమిత్రొవ్.. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం తను స్వీయ నియంత్రణలో ఉన్నానని, మెల్లగా కోలుకుంటున్నానని తెలిపాడు. ఈ నెల 20 న క్రోషియాలోని జదర్ లో జరిగిన బల్కాన్స్ (సెకండ్ లెగ్) టోర్నమెంట్ లోనూ పాల్గొన్నప్పటికీ.. కొద్ది అస్వస్థత కారణంగా మరో ప్లేయర్ బొర్నాకొరిక్ చేతిలో ఓడిపోయాడు. కాగా-నిన్న జొకోవిచ్ కి, రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లెక్ కి మధ్య ఫైనల్ టోర్నమెంట్ జరగాల్సి ఉండగా అది రద్దయింది.