Saturday, July 24

కరోనాకు పతంజలి చెక్.. మరికాసేపట్లో మెడిసిన్ విడుదల..!

కరోనా మహమ్మారికి పతంజలి సంస్థ విరుగుడు మందును తయారు చేసి.. విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌…

కరోనా మహమ్మారికి పతంజలి సంస్థ విరుగుడు మందును తయారు చేసి.. విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ చేతుల మీదుగా ఈ మెడిసిన్‌ను లాంచ్‌ చేశారు. కోరోనిల్ పేరుతో ఈ మెడిసిన్‌ను రిలీజ్ చేశారు. ఇది 4-15 రోజుల వ్యవధిలో కరోనా రోగులను క్యూర్ చేస్తుందని ప్రకటించారు. ఇప్పటికే 280 మంది కరోనా రోగులపై దీనిని ప్రయోగించామని.. రాందేవ్ బాబా ప్రకటించారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారు చేసిన కోరోనిల్ కరోనా రోగులపై ప్రయోగించగా.. మంచి ఫలితాలు వచ్చాయని రాందేవ్ బాబా తెలిపారు. ఈ మందును ఏ విధంగా తయారు చేశారో.. పూర్తిగా వివరించారు. వీటిలో ఏఏ మూలికలను ఉపయోగించారో.. పూర్తిగా మీడియా ముందు ప్రదర్శించారు.