Saturday, September 18

ఫ్యాన్స్ తో తన అభిప్రయాలను పంచుకున్న రకుల్ ప్రీత్ సింగ్

లాక్‌డౌన్‌ సమయంలో ముంబయిలోనే ఉండిపోయిన చిన్నది ఆ సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో తన అభిప్రయాలను పంచుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత ఇటీవలే తన స్వగ్రామం గురుగావ్‌‌కు చేరుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జీవితంలో ఉన్నతమైన లక్ష్యాల్ని సాధించాలనే కలలతో అమ్మనాన్నల్ని, ఇంటిని వదిలి తన జర్నీని ప్రారంభించినట్లుగా చెప్పారు. ఎన్నో కష్టాల్ని, అడ్డంకులను దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను. చాలా కాలం తర్వాత అమ్మనాన్నలతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నాను. మళ్లీ బాల్యంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తోంది. నా వంట రుచి చూసి అమ్మనాన్నలు బాగుందని మెచ్చుకున్నారు. అంటూ పోస్ట్ చేశారు.