
అయితే కోవిడ్ 19 ప్రభావం రాజస్థాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బ తీసిందని చెప్పాలి. పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులతో నిండిపోయే అక్కడి హోటళ్లు, బార్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న నేపథ్యంలో మందుబాబులు బార్ల వైపే చూడట్లేదట. కాగా, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాజస్థాన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలందరూ బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.