Wednesday, June 22

రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం “ పవర్ స్టార్”

రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. తాజాగా ‘పవర్ స్టార్’ అంటూ మరో సినిమాను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆర్‌జి‌వి వరల్డ్ థియేటర్ నుంచి మరో సినిమా పవర్ స్టార్ అంటూ తెలుపుతూ అందులో కొందరు నటుల పేర్లు షాట్ కట్ లో తెలిపాడు.
ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన వర్మ ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో ‘పవర్ స్టార్’ ఇతనే అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.