
అది ఎక్కడో కాదు మన దగ్గరే. ఆంధ్రప్రదేశ్లోని భైరవపాలెం దగ్గరున్న పోలవరం జోన్లోని రిలియన్స్ రిగ్ ప్రదేశంలోని సముద్రంలో ఓ పెద్ద సుడిగాలి ఏర్పడింది. సముద్ర మధ్యలో ఈ సుడిగాలి ఏర్పడగా.. ఆ సమయంలో స్ట్రా వేసుకొని నీటిని తాగుతున్నట్లుగా ఆకాశం కనిపించింది. ఇక ఈ అద్భుతాన్ని అక్కడున్న స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇలాంటి అద్భుతాలు తరచుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే.