
ఈ సినిమాలో అల్లు అర్జున్ పొడుగు జుట్టుతో, ఎయిట్ ప్యాక్స్ తో దర్శనం ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్స్ కోసం జిమ్ లో తగిన కసరత్తులు తీసుకుంటూ వాకింగ్ జాగింగ్ లు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఆయన తాజాగా ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తూ కనిపించాడు అభిమానులు చూసి ఊరుకుంటారా బన్నీ కనపడగానే ఆయన ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టేశారు ఇప్పుడు ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్వీట్టర్ లో ఆయన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో బన్నీ జాగ్ చేస్తూ పెద్ద జుట్టుతో కనిపిస్తున్నాడు దీంతో ఆయన అభిమానులు సుకుమార్ సినిమాలో బన్నీ లుక్ ఇదే అంటూ బన్నీ లుక్ అదిరింది అంటూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం బన్నీ లుక్ అదిరిపోయిందంటూ పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.