Wednesday, May 18

గుబురు గడ్డం రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో రాంచరణ్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. సినిమా కోసం రాంచరణ్ లుక్ మార్చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యాడో చూశారా. మీరు ఆయన్ని చూస్తే అవాక్కవ్వడం ఖాయం. జక్కన్న మూవీ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అందులో చరణ్ కండలతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోలో చరణ్ లుక్ గురించి చర్చ సాగుతోంది. ఈ వీడియోలో జానీ మాస్టర్ గురించి చెబుతూ.. త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే మంచి రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు పక్కన పెడితే ఈ వీడియోలో ఆయన లుక్ మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బాగా వర్కవుట్ చేసి అలసిపోయినట్టుగా వుంది గుబురు గడ్డంతో పాటు బాగా హెయిర్ పెరిగి రఫ్ లుక్‌లో దర్శనమిచ్చాడు చరణ్,. అలాగే డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లుగా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే రామ్ చరణ్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థం అవుతోంది. మన్యం సింహం అల్లూరి సీతారామరాజు ఎంత క్యూట్ గా వుంటాడో అలా కన్పించేందుకు చరణ్ అహర్నిశలు కృషిచేస్తున్నాడు.