Monday, June 14

సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ రికార్డు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్… బాలీవుడ్ కెరీర్ ను అర్ధాంతరంగా ఆపి వేసి తనదైన చెరగని ముద్ర వేసిన సుశాంత్ చివరి సినిమా “దిల్ బెచారా” ట్రెయిలర్ విడుదల కావడం జరిగింది. అయితే “దిల్ బెచారా” ట్రెయిలర్ ఇప్పుడు మంచి ట్రెండ్ కు కొనసాగిస్తుంది. ఈ ట్రెయిలర్ కు 20 మిలియన్ వ్యూస్ మరియు 4 మిలియన్ లకు పైగా లైక్స్ వచ్చిన సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ట్రెయిలర్ మొత్తం మీద నవ్వుతూ ఉండే సుశాంత్ సింగ్ ను చూస్తే అతను ఇంకా బ్రతికే ఉన్నాడనే భ్రమ, బ్రతికి ఉంటే బావున్ను అనే ఆశ కలగడం సహజం. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ కు జోడీగా సంజనా సంఘీ నటించడం జరిగింది. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా “తే ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే నవల ఆధారంగా తెరకెక్కింది.