Thursday, October 24

Education

ఫరా ఇంట్లో సూపర్ 30 సందడి..!!

ఫరా ఇంట్లో సూపర్ 30 సందడి..!!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Politics, viral videos
ఫరా ఇంట్లో సూపర్ 30 సందడి..!! హృతిక్ రోషన్ సూపర్ 30 సినిమా జులై 12 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బీహార్ కు చెందిన మ్యాథమెటిషియన్ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకురాలు ఫరా ఖాన్ తన ఇంట్లో సూపర్ 30 యూనిట్ కు తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ లంచ్ పార్టీకి హృతిక్ తో పాటు దర్శకుడు వికాస్ బల్, సానియా మీర్జా, నేహా ధూపియా, సోనూ సూద్, అదితి రావు హైదరి తదితరులంతా హాజరయ్యారు. వీరి రాకతో ఫరా ఇంట్లో పండుగ వాతావరణం కనిపించింది. ఫరా ఖాన్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. https://youtu.be/XkHV7ROmIVA
‘డియర్‌ కామ్రేడ్’ ట్రైలర్‌ చూశారా..!

‘డియర్‌ కామ్రేడ్’ ట్రైలర్‌ చూశారా..!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, viral videos
‘డియర్‌ కామ్రేడ్’ ట్రైలర్‌ చూశారా..! యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయిక. భరత్ కమ్మ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది?’ అంటూ విజయ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రష్మిక గురించి ఆమె స్నేహితులకు ఫిర్యాదు చేస్తూ.. ‘కైసీ కర్తీ ఇస్సే దోస్తీ.. చాలా కష్ట్‌ హై’ అంటూ వచ్చీ రాని భాషలో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తు్న్న ఈ చిత్రం జులై 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/x_NEfuXTR1c
రకుల్ ఏ సర్టిఫికెట్ చూపిస్తుందట..!!

రకుల్ ఏ సర్టిఫికెట్ చూపిస్తుందట..!!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, viral videos
రకుల్ ఏ సర్టిఫికెట్ చూపిస్తుందట..!! రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న మన్మధుడు 2 సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టీజర్ ఓపెనింగ్ లో పద్దతిగల అమ్మాయిగా కనిపిస్తుంది. అవంతిక పేరుకు తగ్గట్టుగా క్లాస్ గా చీరకట్టుకొని ఏమి తెలియనట్టు కనిస్తుంది. ఆ తరువాతే అసలు రంగు బయటపెడుతోంది రకుల్. నాగార్జునను టీజ్ చేస్తూ ఆటపెట్టిస్తుంది. అక్కడితో ఆగకుండా నాగార్జునకు అదిరిపోయే హింట్ ఇస్తున్నది. ఇప్పటి వరకు యు సర్టిఫికెట్ మాత్రమే చూపించారు. ఇకపై ఏ సర్టిఫికెట్ చూపిస్తా అని చెప్పడంతో నాగ్ షాక్ అవుతాడు. సిగరెట్ తాగుతూ అందరి మతులు పోగొడుతుంది అల్లరిపిల్ల రకుల్. ఫస్ట్ టీజర్ లో నాగ్ చీకట్లో చేసే శృంగారాల గురించి చూపించారు. అందులో రకుల్ ను చూపించలేదు. ఇప్పుడు సెకండ్ టీజర్ లో రకుల్ గురించి చూపిస్తూ.. ఆమె వెనుక దాగున్న రహస్యాన్ని బట్టబయలు చేశారు. రెండు టీజర్లో ఇద్దరు ఇద్దరే అనిపించారు. మరి
అక్షయ్ మిషన్ మంగళ్ టీజర్ టాక్

అక్షయ్ మిషన్ మంగళ్ టీజర్ టాక్

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Politics, viral videos
అక్షయ్ మిషన్ మంగళ్ టీజర్ టాక్ అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా మిషన్ మంగళ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. మార్స్ గ్రహం మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇండియా సక్సెస్ అయ్యింది. మార్స్ పైకి ఉపగ్రహాలు ప్రయోగించిన అరుదైన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరిపోవడం విశేషం. ఈ జైత్రయాత్రను బేస్ చేసుకొని మిషన్ మంగళ్ పేరుతో సినిమా తీసింది బాలీవుడ్. దీనికి సంబంధించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. సెలెబ్రిటీలు సైతం టీజర్ ను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి జగన్ శక్తి దర్శకుడు. https://youtu.be/SPZJFnym8Q0
ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

AP &Telangana, Business, Education, HOROSCOPE, International, National, Technology, viral videos
ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు! హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘కోన’ విడుదల   దిల్లీ: సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కోన’ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్‌, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్‌ఈడీ బల్బ్‌లను అమర్చారు. ఈ డిజైన్‌ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్‌కు హ్యుందాయ్‌ కాస్కేడింగ్‌ డిజైన్‌ గ్రిల్‌ను అమర్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్‌ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ క
ఇది బన్నీ ఫాల్కన్‌

ఇది బన్నీ ఫాల్కన్‌

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Technology, viral videos
ఇది బన్నీ ఫాల్కన్‌ సినిమా తారలు చిత్రీకరణల కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటారు. వెళ్లిన ప్రతి చోటా వాళ్లు సేద తీరడానికి తగిన వసతులు ఉండవు. అందుకే తారల కోసం నిర్మాతలు సెట్‌లో ప్రత్యేకంగా వ్యానిటీ వ్యాన్లని సమకూర్చుతుంటారు. పని పూర్తవ్వగానే వ్యానిటీ వ్యాన్లలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటారు తారలు. అయితే ఇటీవల తారలు వాళ్ల స్థాయికి, అభిరుచులకి తగ్గట్టుగా ప్రత్యేకమైన హంగులతో సొంతంగానే వ్యానిటీ వ్యాన్లని సిద్ధం చేయించుకొంటున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు పెడుతుంటారు. వాళ్ల ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలుంటాయో, అంతకుమించిన హంగులతో వ్యానిటీ వ్యాన్లు సిద్ధం అవుతున్నాయి. అందులో పడక గదులు మొదలుకొని... మేకప్‌, విశ్రాంతి, భోజనాల గదుల వరకు అన్నీ ఉంటాయి. తెలుగులో అగ్ర కథానాయకులందరికీ అలాంటి సొంత వాహనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ ఇటీవల మరో ఖరీదైన వ్యానిటీ వాహనాన్ని కొని, దాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. దాన
ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ ఒకటా.. రెండా! పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానం ఏది! కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడంతో ఇప్పుడు మిగిలి ఉన్న ఆసక్తి ఇదే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆఖరి లీగ్‌ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సరిపోదు. శనివారమే జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు).. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. నేటితో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగియనుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే.. న్యూజిలాండ్‌తో, రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో ఆడుతుంది. లీడ్స్‌: పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆశిస్తున్న టీమ్‌ఇండియా శనివారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది. సెమీస్‌లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్‌ కోహ్లీసేనకు ముఖ్యమైనదే. టోర్నీలో ఎ
కేంద్ర బడ్జెట్‌ – 2019:  ప్రత్యేక కథనాలు

కేంద్ర బడ్జెట్‌ – 2019: ప్రత్యేక కథనాలు

AP &Telangana, Business, Education, HOROSCOPE, local, National, Politics, viral videos
కేంద్ర బడ్జెట్‌ - 2019: ప్రత్యేక కథనాలు 1. లౌక్యంగా వడ్డన నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామంటూ తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌- ఎన్డీయే రెండో ప్రభుత్వ తొలి బడ్జెట్‌ సమర్పణలో తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేతులు మారాక సమయాభావం దృష్ట్యా మొన్న ఫిబ్రవరినాటి అనామతు ప్రతిపాదనల బాణీలోనే ఈసారి బడ్జెట్‌ వంటకం కొనసాగుతుందన్న అంచనాల్ని ఆమె చెల్లాచెదురు చేశారు. అప్పట్లో వెలుగుచూసిన ఎన్నికల పద్దుకు భిన్నంగా ఈసారి మహిళా ఆర్థికమంత్రి బడ్జెట్‌ కూర్పు విధివిధానాలనే మార్చేశారు! 2024నాటికి భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల భూరి ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కనీసం ఎనిమిది శాతం వృద్ధిరేటు అత్యావశ్యకమన్న తాజా సర్వే ఉద్బోధ నేపథ్యంలో- ఆ స్వప్న సాకారమే లక్ష్యమంటూ మంత్రి దశసూత్ర అజెండా వల్లెవేశారు. 2. ఉపాధి పట్టుకొమ్మకు ఊతమేదీ? అఖండ మెజారిటీత
స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో

స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో

AP &Telangana, CINEMA, Education, HOROSCOPE, National, viral videos
స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ కుర్రకారుకు ఈమె డ్రీమ్ గర్ల్. అందుకే ఆమెకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతోంది. ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ పూజా స్కూల్ డేస్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో గోల ఐస్క్రీమ్ తింటూ ఫోజిచ్చింది పూజా. ఇంకేముంది కొద్దిసేపట్లోనే ఆ ఫోటోకు బోలెడు లైకులు, షేర్లు. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సీనియాలో, ప్రభాస్, రాధాకృష్ణలు చేస్తున్న చిత్రంలో కథానాయకిగా చేస్తోంది. ఈ రెండూ కాక హిందీలో కూడా ఒక సినిమా చేస్తోంది పూజా.
బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌

బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, National, Politics
బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌ చిల్లర వ్యాపారుల కోసం 'ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన' పేరుతో కొత్త పథకం ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ ఆమె లోక్‌సభలో ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంగా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం తీసుకువస్తామని చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 2.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆమె చెప్పారు. 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యమని తెలిపారు. జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారన్న ఆమె.. ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. శక్తివంతమైన దేశం కావాలంటే..శక్తివంతమైన పౌరులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.