
మద్యం ప్రియులకు శుభవార్త.. రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్..
AP &Telangana, Business, coronavirus, Education, Festivals, Health, Holidays, HOROSCOPE, local, National, Politics, viral videos, weather
మందుబాబులకు రాజస్థాన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బార్లను సోమవారం నుంచి తెరుచుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. అన్ లాక్ 1 నేపథ్యంలో జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాష్ట్రంలోని బార్లు రాత్రి 9 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది.
అయితే కోవిడ్ 19 ప్రభావం రాజస్థాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బ తీసిందని చెప్పాలి. పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులతో నిండిపోయే అక్కడి హోటళ్లు, బార్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న నేపథ్యంలో మందుబాబులు బార్ల వైపే చూడట్లేదట. కాగా, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాజస్థాన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలందరూ బయటికి వచ్చినప్