Thursday, October 24

Health

శవాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు

శవాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు

Crime, Health, HOROSCOPE, National, viral videos
శవాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు యూపీ ప్రమాదంలో హృదయ విదారక ఘటన ఆగ్రా: ‘మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం. ఒక్కసారిగా బస్సు కుదుపులకు లోనైంది. ఏమైందో తెలుసుకునే లోపే నుజ్జునుజ్జయ్యింది. ఒక్క క్షణం హాహాకారాలు వినిపించాయి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.. చుట్టూ చీకటి..’ అంటూ ఉత్తరప్రదేశ్‌ బస్సు ప్రమాదం నుంచి బయటపడిన రిషి యాదవ్‌ ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. యూపీలోని ఆగ్రా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రిషి ప్రస్తుతం ఆగ్రాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు రక్షించుకునే క్రమంలో కొందరు ప్రయాణికులు శవాలపైకి ఎక్కి బస్సు నుంచి బయటకొచ్చారని రిషి తెలిపారు. గృహప్రవేశానికి వచ్చి వెళ్తూ.. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. లఖ్‌నవూకు చెందిన అవినాశ్‌ అవాస్థి గ్రేటర్‌ నోయిడ
ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు

ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు

AP &Telangana, Education, Health, HOROSCOPE, local, National, viral videos
ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు హైదరాబాద్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శక శిఖామణి విజయ నిర్మల అంతిమ సంస్కారాలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన అసమాన నటీమణికి కుటుంబ సభ్యులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అంతకముందు, నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నానక్‌రామ్‌గూడ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు సమీపంలోని విజయ కృష్ణ గార్డెన్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువుల అశ్రునయనాల మధ్య విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అత్యక్రియలు జరిగాయి. అమె కుమారుడు నరేష్‌ .. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. https://youtu.be/i8ggE4PvS1U
చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు

చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు

Education, Health, HOROSCOPE, International, National, viral videos
చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన వీడియో ఫాతిహ్‌(టర్కీ): రెండో అంతస్తు నుంచి పడిపోతున్న చిన్నారిని కాపాడిన 17 ఏళ్ల యువకుడు నెట్టింట్లో హీరోగా మారిపోయాడు. కొద్దిరోజుల క్రితం టర్కీలోని ఫాతిహ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ ఆంగ్ల మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దోహా మహమ్మద్ అనే రెండేళ్ల బాలిక ఆడుకుంటూ అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తు కిటికీ వద్దకు వచ్చింది. ఆ సమయంలో వంట చేస్తున్న ఆమె తల్లి ఈ విషయాన్ని గుర్తించలేదు. కిటికీలో నుంచి బయటకు వచ్చిన చిన్నారి కింద పడబోతున్న విషయాన్ని ఇంటి బయట ఉన్న ఫ్యూజీ జబాత్ అనే యువకుడు గుర్తించాడు. కింద పడిపోతున్న పాపను సమయస్ఫూర్తితో ఒడిసి పట్టుకున్నాడు. జబాత్‌ వేగంగా స్పందించడంతో చిన్నారికి ఎటువంటి గాయం కాకుండా ప్రాణాలతో బయటపడింది. సీసీటీవీలో రికార్డు అయిన ఈ సంఘటనకు
కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ కుటుంబం

కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ కుటుంబం

AP &Telangana, Business, CINEMA, Education, Health, HOROSCOPE, local, National, viral videos
కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ కుటుంబం ప్రముఖ నటి, దర్శకురాలు, కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రి నుంచి ఆమె భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. విజయనిర్మల భౌతికకాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరా దేవి, తనయుడు నరేశ్‌ కన్నీరుమున్నీరయ్యారు. మంజుల, మహేశ్‌బాబు, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీ మోహన్‌ తదితరులు విజయనిర్మల భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కన్నీరుమున్నీరవుతున్న నరేశ్‌ మహేశ్‌బాబు నమ్రత ఆది శేషగిరిరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీమోహన్‌, మంజుల నివాళులర్పిస్తున్న గాయని రావు బాలసరస్వతి కన్నీరుమున్న
వీడియో: పాపం.. గుడిలో చీరెకు నిప్పంటుకుంది

వీడియో: పాపం.. గుడిలో చీరెకు నిప్పంటుకుంది

Crime, Health, HOROSCOPE, National, viral videos
వీడియో: పాపం.. గుడిలో చీరెకు నిప్పంటుకుంది కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉన్న విశ్వనాథ మందిరంలో పూజ చేయించుకోడానికి వెళ్లిన ఒక మహిళ చీరకు నిప్పంటుకుంది. అక్కడ వెలుగుతున్న కొవ్వొత్తి ఆమె చీర అంచుకు తాకడంతో ఉవ్వెత్తున మంటలు ఎగశాయి. ఈ సంఘటన జూన్ 17న మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది. ఈ సంఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ మహిళకు మంటల కారణంగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మహిళ పేరు ఛాయగా తెలిసింది.ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. https://www.facebook.com/NtvTeluguNews/videos/431051621077963/ ఇవాళ మీడియాలో బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో ఆ మహిళ మంటలతోనే పరుగులు పెడుతూ కనిపించింది. చీరకు నిప్పంటుకోగానే సాయం కోసం అరుస్తోంది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల జనం సాయానికి వచ్చారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. తర్వాత ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనప
ప్రియుడి మోజులో పడి..

ప్రియుడి మోజులో పడి..

AP &Telangana, Crime, Health, HOROSCOPE, local, National, viral videos
ప్రియుడి మోజులో పడి.. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచాల్సిన తల్లి.. ప్రియుడి మోజులో పడిపోయింది.. తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో కులుకుతోంది. అయితే, వీరి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదడం.. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాల్కాలిక సుఖం కోసం తన పిల్లలను తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటన... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో జరిగింది.
చెన్నైలో డేంజర్‌ జర్నీ.. వైరల్‌ అయిన వీడియో

చెన్నైలో డేంజర్‌ జర్నీ.. వైరల్‌ అయిన వీడియో

AP &Telangana, Business, CINEMA, Crime, Education, Health, HOROSCOPE, local, National, viral videos
చెన్నైలో డేంజర్‌ జర్నీ.. వైరల్‌ అయిన వీడియో చెన్నై: వేసవి సెలవుల అనంతరం తమిళనాడులో సోమవారం కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చెన్నైలో కొందరు విద్యార్థుల అత్యుత్సాహం వారిని గాయాలుపాలు చేసింది. పంచయ్యప్ప కళాశాలకు చెందిన విద్యార్థులు రూట్‌ నెంబర్‌ 47 బస్సు ఎక్కి గోల చేశారు. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా బస్సు ప్రయాణిస్తుండగానే పైకి ఎక్కారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే బస్సుపై నృత్యాలు చేశారు. ఈ క్రమంలో బస్సు ముందుగా వెళుతున్న ద్విచక్రవాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సుపై ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ముందు భాగంలో పడిపోయారు. బస్సు వేగం చాలా తక్కువగా ఉండడంతో విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులను పోల
8ఏళ్లలో చైనాను దాటనున్న భారత జనాభా

8ఏళ్లలో చైనాను దాటనున్న భారత జనాభా

AP &Telangana, Education, Health, HOROSCOPE, International, National, Politics, viral videos
8ఏళ్లలో చైనాను దాటనున్న భారత జనాభా ఐక్యరాజ్యసమితి అంచనాలు యునైటెడ్‌ నేషన్స్‌: వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అప్పటి నుంచి దశాబ్దం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ కొనసాగనుందని చెబుతోంది. 2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3కోట్లు పెరిగే అవకాశముందని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. ‘ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలైట్స్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా.. 2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుందని ఐరాస అంచనా వేస్తోంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా దాదాపు 11 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది. కాగా.. ప్రపంచ జనాభా పెరుగుదలలో సగానిపైగా కేవ
కీర్తిని చూస్తే షాక్ అవుతారు..?

కీర్తిని చూస్తే షాక్ అవుతారు..?

AP &Telangana, Business, CINEMA, Education, Health, HOROSCOPE, local, National
కీర్తిని చూస్తే షాక్ అవుతారు..? కీర్తి సురేష్... మహానటి తరువాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు ఈ అమ్మడి చూపులు బాలీవుడ్ మీద ఉన్నాయి. టాలీవుడ్ లో మన్మధుడు 2 లో ఓ చిన్న రోల్ చేస్తోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ తో ఓ సినిమా చేసేందుకు ముంబై చెక్కేసింది. మహానటి సినిమాలో బొద్దుగా కనిపించిన కీర్తి.. బాలీవుడ్ కు వెళ్ళగానే తన మేకోవర్ ను మార్చేసింది. గుర్తుపట్టని విధంగా మారిపోయింది. సన్నగా నాజూగ్గా మారి అందరికి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. గ్లామర్ కు బాలీవుడ్ పెట్టింది పేరు. దక్షిణాది సినిమాల్లో కీర్తి గ్లామర్ ను పక్కన పెట్టి సినిమాలు చేసింది. బాలీవుడ్ లో అలా కుదరదు. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో చూద్దాం.
బాయిలర్‌ పేలి ముగ్గురి మృతి

బాయిలర్‌ పేలి ముగ్గురి మృతి

AP &Telangana, Crime, Health, HOROSCOPE, local, National, Technology, viral videos
బాయిలర్‌ పేలి ముగ్గురి మృతి బొబ్బిలి టౌన్‌: విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో విధుల్లో ఉన్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బొబ్బిలి మండలం అలజంగికి చెందిన జగదీశ్‌, బాడంగి మండలం గొల్లాదికి చెందిన సురేశ్‌, భీమవరం గ్రామానికి చెందిన చింతల గోపాలనాయుడుగా గుర్తించారు. ఏఎస్పీ గౌతం శాలీ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను బొబ్బిలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలు ఆర్పివేశారు.