
పీపీఈ కిట్లు ధరించి మరి జ్యువెలరీ దొంగతనం
AP &Telangana, Business, coronavirus, Crime, Education, Health, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos
అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో దొంగలకు సాటిరారెవరు. వారికి తెలివి మమూలుగా ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో దొంగలు మరింత తెలివిగా వ్యవహరించారు. పీపీఈ కిట్లు ధరించి ఓ బంగారం దుకాణంలో చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఓ బంగారం షాపులోకి దొంగలు ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌసులతో పాటు పీపీఈ కిట్లు ధరించి చొరబడ్డారు అనంతరం దుకాణంలో ఉన్న 780 గ్రాముల బంగారం ఆభరణాలను దొంగిలించారు. ఈ దృశ్యాలను అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ర్ట లోని సతారా జిల్లాలో రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి రావడంతోబంగారం దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసును విచారణ చేస్తున్నారు పోలీసులు.