Thursday, October 24

International

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

AP &Telangana, Business, Education, HOROSCOPE, International, National, Technology, viral videos
ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు! హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘కోన’ విడుదల   దిల్లీ: సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కోన’ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్‌, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్‌ఈడీ బల్బ్‌లను అమర్చారు. ఈ డిజైన్‌ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్‌కు హ్యుందాయ్‌ కాస్కేడింగ్‌ డిజైన్‌ గ్రిల్‌ను అమర్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్‌ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ క
ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ ఒకటా.. రెండా! పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానం ఏది! కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడంతో ఇప్పుడు మిగిలి ఉన్న ఆసక్తి ఇదే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆఖరి లీగ్‌ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సరిపోదు. శనివారమే జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు).. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. నేటితో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగియనుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే.. న్యూజిలాండ్‌తో, రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో ఆడుతుంది. లీడ్స్‌: పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆశిస్తున్న టీమ్‌ఇండియా శనివారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది. సెమీస్‌లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్‌ కోహ్లీసేనకు ముఖ్యమైనదే. టోర్నీలో ఎ
వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

Education, International, National, Politics, Sports, viral videos
వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ప్రపంచకప్‌లో మరో పోరుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లకూ సెమీస్‌ ఆశలు గల్లంతవడంతో ఇది నామమాత్రపు మ్యాచ్‌గానే మిగలనుంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో, విండీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ జట్టు: గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హిట్మెయిర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫాబియన్ ఆలెన్, షెల్డన్ కాట్రెల్, థామస్, షానూన్ గాబ్రియేల్ శ్రీలంక జట్టు: కరుణరత్నే, కౌశల్ పెరెరా, ఫెర్నాండో, కుశల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, జెఫ్రీ వండెర్సే, కసున్ రజిత, మలింగ
ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

Business, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Sports, viral videos
ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌ అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ లండన్‌: ప్రపంచకప్‌ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ తప్పుకొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తుండగా విజయ్‌శంకర్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతడు ప్రపంచకప్‌లో కొనసాగడం కష్టంగా ఉందని, స్వదేశానికి తిరిగొస్తాడని అధికారి తెలిపారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేసిందని అన్నారు. కాగా మయాంక్‌ అగర్వాల్‌ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడి ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయ్‌శంకర్‌కి బదులు రిషభ్‌పంత్‌ను ఆడించింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత
క్షణాల్లో స్పందించి బిడ్డను కాపాడిన తల్లి

క్షణాల్లో స్పందించి బిడ్డను కాపాడిన తల్లి

Education, HOROSCOPE, International, local, National, Politics, viral videos
క్షణాల్లో స్పందించి బిడ్డను కాపాడిన తల్లి తన కుమారుడు నాలుగో అంతస్తు పై నుంచి పడిపోబోతుండగా ఓ తల్లి మెరుపు వేగంతో స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన కొలండియాలోని మెదెయీన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి లిఫ్ట్‌లో నాలుగో అంతస్తుకు చేరుకుంది. లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చిన మహిళ.. ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆమె బిడ్డ అక్కడే ఉన్న రెయిలింగ్‌ వద్దకు వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడ గ్రిల్స్‌ లేకపోవడంతో ఒక్క సారిగా అదుపుతప్పి కిందపడబోయాడు. దీన్ని గమనించిన తల్లి.. సెకన్ల వ్యవధిలోనే ఆ బిడ్డ కాళ్లను పట్టుకుని లాగింది. దీంతో ఆ బిడ్డ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. లిఫ్ట్ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు క
చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు

చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు

Education, Health, HOROSCOPE, International, National, viral videos
చిన్నారిని బంతిలా పట్టుకున్నాడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన వీడియో ఫాతిహ్‌(టర్కీ): రెండో అంతస్తు నుంచి పడిపోతున్న చిన్నారిని కాపాడిన 17 ఏళ్ల యువకుడు నెట్టింట్లో హీరోగా మారిపోయాడు. కొద్దిరోజుల క్రితం టర్కీలోని ఫాతిహ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ ఆంగ్ల మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దోహా మహమ్మద్ అనే రెండేళ్ల బాలిక ఆడుకుంటూ అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తు కిటికీ వద్దకు వచ్చింది. ఆ సమయంలో వంట చేస్తున్న ఆమె తల్లి ఈ విషయాన్ని గుర్తించలేదు. కిటికీలో నుంచి బయటకు వచ్చిన చిన్నారి కింద పడబోతున్న విషయాన్ని ఇంటి బయట ఉన్న ఫ్యూజీ జబాత్ అనే యువకుడు గుర్తించాడు. కింద పడిపోతున్న పాపను సమయస్ఫూర్తితో ఒడిసి పట్టుకున్నాడు. జబాత్‌ వేగంగా స్పందించడంతో చిన్నారికి ఎటువంటి గాయం కాకుండా ప్రాణాలతో బయటపడింది. సీసీటీవీలో రికార్డు అయిన ఈ సంఘటనకు
ప్రపంచకప్‌లో ‘f2’

ప్రపంచకప్‌లో ‘f2’

AP &Telangana, Education, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
ప్రపంచకప్‌లో ‘f2’ హీరోతో ఫైట్స్‌, ఛేజింగ్‌ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించినా, నటీనటులు స్టెప్పులతో అదరగొట్టినా అభిమానులకు సంతృప్తి ఉండదు. వినోదం కోసం వెళ్లే సినిమా వినోదభరితంగా అనిపించకపోతే ఎలా?అనే రీతిలో ఆలోచిస్తారు వారు. క్రికెట్‌లోనూ అంతే. పరుగుల వరద పారిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు బౌలర్లు ముకుతాడు వెయ్యడం, కవ్విస్తున్న బౌలర్లకు బ్యాట్స్‌మెన్‌ బౌండరీలతో సమాధానం చెప్పడం రొటీన్‌. అంతకు మించిన వినోదం కోరుకుంటున్న క్రికెట్‌ అభిమానులకు ప్రస్తుత ప్రపంచకప్‌ ఎన్నో సరదా సన్నివేశాలతో ఆహ్లాదాన్ని పంచింది. అవి ఏంటంటే.. సారీ అంపైర్‌! ఎవరైనా సెంచరీ సాధిస్తే హెల్మెట్‌ తీసి బ్యాట్‌తో అభిమానులకు వందనం చేస్తారు. కానీ బంగ్లాదేశ్‌×ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో శతకం సాధించిన ఆనందంలో జేసన్‌ రాయ్‌ అంపైర్‌ను ఢీకొట్టాడు. అతడు 96 పరుగులతో ఉన్నప్పుడు డీప్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా బౌండరీ బాదాడు. బౌండరీవైపు చూస్తూ పరిగెడుతున్న
తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..!

తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..!

Business, Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..! డ్రాగన్‌ బెదిరిపోయేలా ట్రంప్‌ వ్యూహం ఇరాన్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకోనున్న అమెరికా   ట్రంప్‌ అధ్యక్షుడు కాకాముందు వ్యాపారం చేసేవారు.. ఆయనో పేద్ద బిజినెస్‌ టైకూన్‌. అధ్యక్షుడు అయ్యాక కూడా ఆయనకు వ్యాపారం చేసే అలవాటు.. బేరాలాడే బుద్ధి మారలేదు. ఆయన ఇప్పుడు ఇరాన్‌ సంక్షోభాన్ని కూడా వ్యాపారంగా మార్చేశారు.. చైనాతో వాణిజ్య యుద్ధంలో బేరం అడటానికి దీన్నో పాశుపతాస్త్రం వలే ఎక్కుపెట్టారు. తుపాకీ ఇరాన్‌కు గురిపెట్టినా తూటా మాత్రం చైనాకు తగలాలని భావిస్తున్నారు. తన మనసులో మాటను ట్విటర్‌లో బయటపెట్టారు. ‘‘చైనా 91శాతం , జపాన్‌ 62శాతం చమురు ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధి నుంచే వెళుతున్నాయి. అలాంటప్పుడు ఇతర దేశాల కోసం ఈ జలసంధిలోని నౌకామార్గాలను మేము ఫ్రీగా ఎందుకు కాపాడాలి? నిత్యం ప్రమాదకరంగా ఉండే ఈ మార్గంలో ఆ దేశాలే వారి నౌకలను రక్షించుకోవాలి. అసలే ఇది ప్రమాద
90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా

90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా

AP &Telangana, Business, Crime, International, National, Politics, Technology, viral videos
90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా వివరాలను వెల్లడించిన పైలట్లు దాదాపు 48 ఏళ్ల తర్వాత భారత వాయుసేన పాక్‌పై ఎలా దాడి చేసిందో వెల్లడైంది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు పైలట్లు ఆపరేషన్‌ వివరాలను పరిమితంగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఈ దాడి కోసం వాయుసేన చేసిన కసరత్తు..శత్రువు దృష్టి మళ్లించడానికి పన్నిన ఉచ్చును వివరించారు. మన వాయుసేన వీరులు ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటి ఉగ్రశిబిరాలను నాశనం చేసిన తీరును వీరు కళ్లకుగట్టారు. దాడి సన్నద్ధత ఇలా.. పుల్వామ ఘటన తర్వాత జైషే ఉగ్రమూక అంతు చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. దీనిపై తర్జనభర్జనల తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ విషయం మూడోకంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి సరిహద్దులకు అత్యంత దగ్గరగా కాంబాట్‌ ఎయిర్‌ పెట్రోల్‌(వైమానిక గస్తీ)లు పెంచారని ఆపరేషన్‌లో పాల్గొన్న
భారత్‌-పాక్‌ పోరులో ఇదో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’!

భారత్‌-పాక్‌ పోరులో ఇదో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’!

Business, Education, Festivals, HOROSCOPE, International, National, Politics, viral videos
భారత్‌-పాక్‌ పోరులో ఇదో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’! ఒకరికోసం ఒకరం జీవిస్తూ.. కలకాలం కలిసుండాలనే ఆశయంతో ముందుకుసాగేది నిజమైన ప్రేమ. అందరి కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చి మనసులో పదిలమైన స్థానం కల్పించే వారి కోసం భాగస్వాములు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరి నిజమైన ప్రేమ ఉండి, వారికి పదిలమైన స్థానం కల్పించాలని నిశ్చయించుకున్నప్పుడు వారి వద్ద మన ప్రేమను వ్యక్తపరచడానికి ఒక అద్భుతమైన సందర్భం ఉంటే ఎంత బాగుంటుంది. ఆ సందర్భం గనక దేశవాసులంతా ఉత్కంఠగా చూస్తున్న వేడుకే అయితే. జీవితాంతం గుర్తుండిపోదు. అలాంటిదే జరిగింది..ఇటీవల భారత్‌ పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో.. ఇటీవల ప్రపంచకప్‌లో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఓ వైపు వరుణుడి దోబూచులాట, మరోవైపు దాయాదుల పోరు. ఫలితం ఏమవుతుందో అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్విటర్‌ అభిమానుల ప్రార్థనల