Thursday, October 24

Sports

ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ ఒకటా.. రెండా! పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానం ఏది! కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడంతో ఇప్పుడు మిగిలి ఉన్న ఆసక్తి ఇదే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆఖరి లీగ్‌ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సరిపోదు. శనివారమే జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు).. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. నేటితో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగియనుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే.. న్యూజిలాండ్‌తో, రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో ఆడుతుంది. లీడ్స్‌: పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆశిస్తున్న టీమ్‌ఇండియా శనివారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది. సెమీస్‌లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్‌ కోహ్లీసేనకు ముఖ్యమైనదే. టోర్నీలో ఎ
వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

Education, International, National, Politics, Sports, viral videos
వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ప్రపంచకప్‌లో మరో పోరుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లకూ సెమీస్‌ ఆశలు గల్లంతవడంతో ఇది నామమాత్రపు మ్యాచ్‌గానే మిగలనుంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో, విండీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ జట్టు: గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హిట్మెయిర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫాబియన్ ఆలెన్, షెల్డన్ కాట్రెల్, థామస్, షానూన్ గాబ్రియేల్ శ్రీలంక జట్టు: కరుణరత్నే, కౌశల్ పెరెరా, ఫెర్నాండో, కుశల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, జెఫ్రీ వండెర్సే, కసున్ రజిత, మలింగ
ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

Business, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Sports, viral videos
ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌ అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ లండన్‌: ప్రపంచకప్‌ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ తప్పుకొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తుండగా విజయ్‌శంకర్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతడు ప్రపంచకప్‌లో కొనసాగడం కష్టంగా ఉందని, స్వదేశానికి తిరిగొస్తాడని అధికారి తెలిపారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేసిందని అన్నారు. కాగా మయాంక్‌ అగర్వాల్‌ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడి ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయ్‌శంకర్‌కి బదులు రిషభ్‌పంత్‌ను ఆడించింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత
ప్రపంచకప్‌లో ‘f2’

ప్రపంచకప్‌లో ‘f2’

AP &Telangana, Education, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
ప్రపంచకప్‌లో ‘f2’ హీరోతో ఫైట్స్‌, ఛేజింగ్‌ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించినా, నటీనటులు స్టెప్పులతో అదరగొట్టినా అభిమానులకు సంతృప్తి ఉండదు. వినోదం కోసం వెళ్లే సినిమా వినోదభరితంగా అనిపించకపోతే ఎలా?అనే రీతిలో ఆలోచిస్తారు వారు. క్రికెట్‌లోనూ అంతే. పరుగుల వరద పారిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు బౌలర్లు ముకుతాడు వెయ్యడం, కవ్విస్తున్న బౌలర్లకు బ్యాట్స్‌మెన్‌ బౌండరీలతో సమాధానం చెప్పడం రొటీన్‌. అంతకు మించిన వినోదం కోరుకుంటున్న క్రికెట్‌ అభిమానులకు ప్రస్తుత ప్రపంచకప్‌ ఎన్నో సరదా సన్నివేశాలతో ఆహ్లాదాన్ని పంచింది. అవి ఏంటంటే.. సారీ అంపైర్‌! ఎవరైనా సెంచరీ సాధిస్తే హెల్మెట్‌ తీసి బ్యాట్‌తో అభిమానులకు వందనం చేస్తారు. కానీ బంగ్లాదేశ్‌×ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో శతకం సాధించిన ఆనందంలో జేసన్‌ రాయ్‌ అంపైర్‌ను ఢీకొట్టాడు. అతడు 96 పరుగులతో ఉన్నప్పుడు డీప్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా బౌండరీ బాదాడు. బౌండరీవైపు చూస్తూ పరిగెడుతున్న
తండ్రి మరణవార్త విన్నా.. దేశం కోసం ఆడి

తండ్రి మరణవార్త విన్నా.. దేశం కోసం ఆడి

Business, Education, HOROSCOPE, local, National, Sports, viral videos
తండ్రి మరణవార్త విన్నా.. దేశం కోసం ఆడి దిల్లీ: కన్నతండ్రి ఇక లేరని తెలిసినా గుండె దిటవు చేసుకుని దేశం కోసం ఆడిందీ క్రీడాకారిణి. నాన్న ఆఖరిచూపునకు కూడా వెళ్లకుండా తన జట్టు కోసం పోరాడింది. ఆమె త్యాగం వృథా కాలేదు.. దేశం గర్వించేలా ఆ జట్టు హాకీ సిరీస్‌లో విజయ దుందుభి మోగించింది. ఆమే 19ఏళ్ల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌రెమ్సియామీ గురించి నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ తండ్రి మరణాన్ని దిగమింగుకుని దేశం కోసం ఆడిన వనితగా నేడు ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టులో సభ్యురాలు. గత ఆదివారం ఈ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్‌ సిరిస్‌లో ఆతిథ్య జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక.. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది. అయితే ఫైనల్
వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

Business, Education, HOROSCOPE, International, National, Politics, Sports, Technology, viral videos
వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు.. వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా తలపడనున్నది. టోరీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో మూడింట్లో కివీస్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దయింది. 5 మ్యాచులాడిన దక్షిణాఫ్రికా కేవలం ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే సఫారీలకు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే.
భారత్‌×పాక్‌: మా కుటుంబీకుల జోలికి రావొద్దు!

భారత్‌×పాక్‌: మా కుటుంబీకుల జోలికి రావొద్దు!

AP &Telangana, Crime, Education, HOROSCOPE, International, National, Politics, Sports, viral videos
భారత్‌×పాక్‌: మా కుటుంబీకుల జోలికి రావొద్దు! మా కుటుంబాలకు తగిన గౌరవం ఇవ్వండి: షోయబ్‌ మాలిక్‌ విజ్ఞప్తిముంబయి: దాయాదుల సమరం ముగిసింది. టీమిండియా వరుసగా ఏడోసారి ప్రపంచకప్‌లో పాక్‌ను ఓడించింది. అసలే భావోద్వేగాలు నిండిన మ్యాచ్‌ అది. గతంలో భారత్‌ చేతిలో ఓడినప్పుడు పాక్‌ అభిమానులు టీవీలు పగలగొట్టేసిన దాఖలాలు ఉన్నాయి. ఆటగాళ్ల ఇళ్లపై దాడులు చేసిన ఉదంతాలూ చూశాం. ఈ సారి సోషల్‌ మీడియాలో దాయాది ఆటగాళ్లను అభిమానులు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అందులోకి క్రీడాకారుల కుటుంబ సభ్యులనూ లాగుతున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి సతీమణి సానియా మీర్జాతో కలిసి షోయబ్‌ మాలిక్‌ గడిపినట్లు ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. వారిద్దరినీ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తుండటంతో మాలిక్‌ ఓ ట్వీట్‌ చేశాడు. కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగొద్దని సూచించాడు. పనిలో పనిగా మీడియా ఎప్పుడు జవాబుదారీతనం పాటిస్తుందని అడిగేశాడు!
బంగ్లా బ్యాట్సమన్‌ పరుగుల ప్రవాహం..

బంగ్లా బ్యాట్సమన్‌ పరుగుల ప్రవాహం..

AP &Telangana, Education, HOROSCOPE, National, Politics, Sports, viral videos
బంగ్లా బ్యాట్సమన్‌ పరుగుల ప్రవాహం.. దక్షిణాఫ్రికాపై 75, న్యూజిలాండ్‌పై 64, ఇంగ్లాండ్‌పై 121, వెస్టిండీస్‌పై 124 నాటౌట్‌.. ఇవీ ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్సమన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ చేసిన స్కోర్లు. దుమ్ము రేపే ఫామ్‌లో ఉన్న ఈ హార్డ్‌ హిట్టింగ్ బ్యాట్సమన్‌ స్టార్‌ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను చిత్తు చేసిన బంగ్లా జట్టులో షకీబ్‌దే కీలక పాత్ర. కెరీర్‌లోనే పీక్‌ స్టేజ్‌లో ఉన్న షకీబ్‌ అల్‌ హసన్‌.. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో 5 వికెట్లు తీసిన షకీబ్‌.. మున్ముందు మరిన్ని అత్యత్తమ ప్రదర్శనలిస్తానని చెబుతున్నాడు. షకీబ్‌ సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ అయితే.. బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరినా చేరొచ్చు..!
సర్ఫరాజ్‌కు బుర్ర లేదు: అక్తర్‌

సర్ఫరాజ్‌కు బుర్ర లేదు: అక్తర్‌

Business, Education, HOROSCOPE, International, Jobs, National, Sports, viral videos
సర్ఫరాజ్‌కు బుర్ర లేదు: అక్తర్‌ భారత్‌ చేతిలో ఘోర పరాజయం పాలవడంతో పాక్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సర్ఫరాజ్‌ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాల వల్లే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయామని పాక్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ విమర్శించాడు. పాక్‌ ప్రధాన బలం బౌలింగ్‌ అని.. అటువంటప్పుడు తొలుత బౌలింగ్‌ చేయడం చాలా పెద్ద తప్పిదం అని అన్నాడు. టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచినట్టేనని భావించామని.. కానీ భారత్‌కు తొలుత బ్యాటింగ్‌ అప్పగించి సర్ఫరాజ్‌ పెద్ద తప్పు చేశాడని అక్తర్‌ విమర్శించాడు. సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్సీ అని విమర్శించిన అక్తర్‌.. ప్రతి మ్యాచ్‌లోనూ బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటున్నాడని అన్నాడు.
పాకిస్థాన్‌పై ఇది మరో స్ట్రైక్‌ : అమిత్‌షా

పాకిస్థాన్‌పై ఇది మరో స్ట్రైక్‌ : అమిత్‌షా

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, International, local, National, Politics, Sports, viral videos
పాకిస్థాన్‌పై ఇది మరో స్ట్రైక్‌ : అమిత్‌షా టీమిండియాపై ప్రశంసల వర్షం పాకిస్థాన్‌పై టీమిండియాది మరో స్ట్రైక్‌ అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. ప్రపంచకప్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పాక్‌ను ఏడోసారి చిత్తు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట రోహిత్‌ శతకంతో చెలరేగితే తర్వాత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నేతలతో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షా-పాకిస్థాన్‌పై.. టీమిండియా మరో స్ట్రైక్‌ చేసింది. అదే ఫలితం. మంచి ప్రదర్శన చేసినందుకు అభినందనలు. మీ విజయంతో ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయం కోసం కోహ్లీసేన అద్భుతమ