Thursday, October 24

Technology

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు!

AP &Telangana, Business, Education, HOROSCOPE, International, National, Technology, viral videos
ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ. ప్రయాణించవచ్చు! హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘కోన’ విడుదల   దిల్లీ: సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కోన’ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్‌, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్‌ఈడీ బల్బ్‌లను అమర్చారు. ఈ డిజైన్‌ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్‌కు హ్యుందాయ్‌ కాస్కేడింగ్‌ డిజైన్‌ గ్రిల్‌ను అమర్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్‌ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ క
ఇది బన్నీ ఫాల్కన్‌

ఇది బన్నీ ఫాల్కన్‌

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Technology, viral videos
ఇది బన్నీ ఫాల్కన్‌ సినిమా తారలు చిత్రీకరణల కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటారు. వెళ్లిన ప్రతి చోటా వాళ్లు సేద తీరడానికి తగిన వసతులు ఉండవు. అందుకే తారల కోసం నిర్మాతలు సెట్‌లో ప్రత్యేకంగా వ్యానిటీ వ్యాన్లని సమకూర్చుతుంటారు. పని పూర్తవ్వగానే వ్యానిటీ వ్యాన్లలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటారు తారలు. అయితే ఇటీవల తారలు వాళ్ల స్థాయికి, అభిరుచులకి తగ్గట్టుగా ప్రత్యేకమైన హంగులతో సొంతంగానే వ్యానిటీ వ్యాన్లని సిద్ధం చేయించుకొంటున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు పెడుతుంటారు. వాళ్ల ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలుంటాయో, అంతకుమించిన హంగులతో వ్యానిటీ వ్యాన్లు సిద్ధం అవుతున్నాయి. అందులో పడక గదులు మొదలుకొని... మేకప్‌, విశ్రాంతి, భోజనాల గదుల వరకు అన్నీ ఉంటాయి. తెలుగులో అగ్ర కథానాయకులందరికీ అలాంటి సొంత వాహనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ ఇటీవల మరో ఖరీదైన వ్యానిటీ వాహనాన్ని కొని, దాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. దాన
సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది…!!

సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది…!!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Technology, viral videos
సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది...!! ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది. కొద్దిసేపటికి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. అల్ట్రా ఎలెక్ట్రిక్ మ్యూజిక్ తో అదిరిపోయింది. జస్ట్ 28 సెకన్ల నిడివికలిగిన ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. జులై 8 వ తేదీన ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ రోజుకొక్కటి చొప్పున రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది. పోస్టర్లు, ఫోటోలు, సింగిల్స్ టీజర్, సింగిల్స్ ను రిలీజ్ వరసగా రిలీజ్ చేస్తారట. ఆడియో, ప్రీ రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు. https://youtu.be/1jDRlTZB1Lc
తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..!

తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..!

Business, Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
తుపాకీ గురి ఇరాన్‌కు.. తూటా చైనాకు..! డ్రాగన్‌ బెదిరిపోయేలా ట్రంప్‌ వ్యూహం ఇరాన్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకోనున్న అమెరికా   ట్రంప్‌ అధ్యక్షుడు కాకాముందు వ్యాపారం చేసేవారు.. ఆయనో పేద్ద బిజినెస్‌ టైకూన్‌. అధ్యక్షుడు అయ్యాక కూడా ఆయనకు వ్యాపారం చేసే అలవాటు.. బేరాలాడే బుద్ధి మారలేదు. ఆయన ఇప్పుడు ఇరాన్‌ సంక్షోభాన్ని కూడా వ్యాపారంగా మార్చేశారు.. చైనాతో వాణిజ్య యుద్ధంలో బేరం అడటానికి దీన్నో పాశుపతాస్త్రం వలే ఎక్కుపెట్టారు. తుపాకీ ఇరాన్‌కు గురిపెట్టినా తూటా మాత్రం చైనాకు తగలాలని భావిస్తున్నారు. తన మనసులో మాటను ట్విటర్‌లో బయటపెట్టారు. ‘‘చైనా 91శాతం , జపాన్‌ 62శాతం చమురు ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధి నుంచే వెళుతున్నాయి. అలాంటప్పుడు ఇతర దేశాల కోసం ఈ జలసంధిలోని నౌకామార్గాలను మేము ఫ్రీగా ఎందుకు కాపాడాలి? నిత్యం ప్రమాదకరంగా ఉండే ఈ మార్గంలో ఆ దేశాలే వారి నౌకలను రక్షించుకోవాలి. అసలే ఇది ప్రమాద
90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా

90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా

AP &Telangana, Business, Crime, International, National, Politics, Technology, viral videos
90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా వివరాలను వెల్లడించిన పైలట్లు దాదాపు 48 ఏళ్ల తర్వాత భారత వాయుసేన పాక్‌పై ఎలా దాడి చేసిందో వెల్లడైంది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు పైలట్లు ఆపరేషన్‌ వివరాలను పరిమితంగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఈ దాడి కోసం వాయుసేన చేసిన కసరత్తు..శత్రువు దృష్టి మళ్లించడానికి పన్నిన ఉచ్చును వివరించారు. మన వాయుసేన వీరులు ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటి ఉగ్రశిబిరాలను నాశనం చేసిన తీరును వీరు కళ్లకుగట్టారు. దాడి సన్నద్ధత ఇలా.. పుల్వామ ఘటన తర్వాత జైషే ఉగ్రమూక అంతు చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. దీనిపై తర్జనభర్జనల తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ విషయం మూడోకంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి సరిహద్దులకు అత్యంత దగ్గరగా కాంబాట్‌ ఎయిర్‌ పెట్రోల్‌(వైమానిక గస్తీ)లు పెంచారని ఆపరేషన్‌లో పాల్గొన్న
అంపైరే ఆశ్చర్యపోయాడు.. !

అంపైరే ఆశ్చర్యపోయాడు.. !

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, Politics, Technology, viral videos
అంపైరే ఆశ్చర్యపోయాడు.. ! లండన్‌: వెస్టిండీస్‌ X ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓ హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన పొరపాటు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని విండీస్‌ బ్యాటర్‌ సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో ఈజీ రనౌట్‌కు అవకాశమున్నా.. బౌలర్‌ పొరపాటు కారణంగా ఆమె ఔట్‌ నుంచి తప్పించుకుంది. ఆ బ్యాటర్‌ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు పరుగెడుతుండగా ఫీల్డర్‌ బంతిని అందుకొని బౌలర్‌కి త్రో చేసింది. ఆమె తనవైపు వస్తున్న బ్యాటర్‌ని గమనించకుండా కీపర్‌ వైపు పరుగెడుతున్న బ్యాటర్‌ని ఔట్‌ చేసేందుకు త్రో విసిరింది. ఆమె చేసిన పొరపాటు వీడియోలో పూర్తి వినోదభరితంగా ఉండడంతో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘స్ట్రైకర్‌ని కాకుండా నాన్‌స్ట్రైకర్‌ని ఔట్‌ చేసే సత్తా మీకు మాత్రమే ఉంది’, ‘ఆట తీరుతో
వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

Business, Education, HOROSCOPE, International, National, Politics, Sports, Technology, viral videos
వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు.. వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా తలపడనున్నది. టోరీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో మూడింట్లో కివీస్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దయింది. 5 మ్యాచులాడిన దక్షిణాఫ్రికా కేవలం ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే సఫారీలకు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే.
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..

AP &Telangana, Crime, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. కాకినాడ మెయిన్ రోడ్డులోని గ్లాస్‌ హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున 4గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సూపర్ మార్కెట్‌లో చెలరేగిన మంటలు మూడు ఫ్లోర్లకు వ్యాపించాయి. సూపర్‌ మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తులు, స్కూల్‌ బ్యాగులు, రెడీమేడ్‌ వస్త్రాల షాపులు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఖజరహో అందానివో.. వెన్నెల అమృతానివో..!!

ఖజరహో అందానివో.. వెన్నెల అమృతానివో..!!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos
ఖజరహో అందానివో.. వెన్నెల అమృతానివో..!! ఆహా కళ్యాణం అనగానే ఆహా అనిపించే విధంగా నటించిన వాణి కపూర్ గుర్తుకు వస్తుంది. ఇది బాలీవుడ్ శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాకు రీమేక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. దీని తరువాత భేఫిక్రే సినిమా చేసింది. సినిమా హిట్ కొట్టకపోయినా.. రణ్వీర్ సింగ్ తో పోటీపడి నటించింది. పోటీపడి ముద్దుల వర్షం కురిపించింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ..యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీ వేసుకొని వెనక్కి తిరిగి కూర్చున్న ఫోటో అది. ఈ అమ్మడి ఒంపుసొంపులు చూస్తుంటే... ఖజరహో శిల్పంలా ఉన్నది. వెన్నెల్లో కురిసే అమృతవర్షిణిలా ఉన్నది. ఈ ఫొటోకు యూత్ ఇస్తున్న కామెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉండటం విశేషం.
అంబానీపై చైనా ఒత్తిడి..!

అంబానీపై చైనా ఒత్తిడి..!

AP &Telangana, Business, Crime, HOROSCOPE, International, National, Technology, viral videos
అంబానీపై చైనా ఒత్తిడి..! ప్రపంచానికే రుణదాతగా మారిన చైనా ఇప్పుడు అంబానీకి కూడా అప్పులు ఇచ్చింది. ఒక రకంగా అనిల్‌అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిలిచింది. నిన్న ఆర్‌కామ్‌ దివాల ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. ఇక మిగిలిన బ్యాంకులతో కలిపి మొత్తం 2.1బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్‌కామ్‌ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ.57,382 కోట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు చెల్లించాలి. ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.1,554 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆస్తులను రూ.17,300 కోట్లకు జ