
దూరదర్శన్ మ్యూజిక్ షోకి యాంకర్‌గా షారుక్..
AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Fun Shows, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos, weather
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాక్టర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఎన్నో షోస్‌ని రక్తి కట్టించారు. అవార్డ్ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా తనదైన పంచ్‌లతో ఆడియన్స్‌లో జోష్ నింపుతూంటారు. అయితే తనలో ఈ కళ హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. షారుక్ 1990వ దశకంలోనే మొదట్లో దూరదర్శన్ ఛానెల్లో ఓ మ్యూజిక్ షోలో వ్యాఖ్యాత (యాంకర్)గా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంలో మరోసారి విషయం బయటకొచ్చింది.
https://twitter.com/Bollywoodirect/status/1179742883978440706