Thursday, October 24
కేంద్ర బడ్జెట్‌ – 2019:  ప్రత్యేక కథనాలు

కేంద్ర బడ్జెట్‌ – 2019: ప్రత్యేక కథనాలు

AP &Telangana, Business, Education, HOROSCOPE, local, National, Politics, viral videos
కేంద్ర బడ్జెట్‌ - 2019: ప్రత్యేక కథనాలు 1. లౌక్యంగా వడ్డన నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామంటూ తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌- ఎన్డీయే రెండో ప్రభుత్వ తొలి బడ్జెట్‌ సమర్పణలో తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేతులు మారాక సమయాభావం దృష్ట్యా మొన్న ఫిబ్రవరినాటి అనామతు ప్రతిపాదనల బాణీలోనే ఈసారి బడ్జెట్‌ వంటకం కొనసాగుతుందన్న అంచనాల్ని ఆమె చెల్లాచెదురు చేశారు. అప్పట్లో వెలుగుచూసిన ఎన్నికల పద్దుకు భిన్నంగా ఈసారి మహిళా ఆర్థికమంత్రి బడ్జెట్‌ కూర్పు విధివిధానాలనే మార్చేశారు! 2024నాటికి భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల భూరి ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కనీసం ఎనిమిది శాతం వృద్ధిరేటు అత్యావశ్యకమన్న తాజా సర్వే ఉద్బోధ నేపథ్యంలో- ఆ స్వప్న సాకారమే లక్ష్యమంటూ మంత్రి దశసూత్ర అజెండా వల్లెవేశారు. 2. ఉపాధి పట్టుకొమ్మకు ఊతమేదీ? అఖండ మెజారిటీత

స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో

స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో

AP &Telangana, CINEMA, Education, HOROSCOPE, National, viral videos
స్కూల్ యూనిఫామ్‌లో పూజా హెగ్డే.. వైరల్ ఫోటో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ కుర్రకారుకు ఈమె డ్రీమ్ గర్ల్. అందుకే ఆమెకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతోంది. ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ పూజా స్కూల్ డేస్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో గోల ఐస్క్రీమ్ తింటూ ఫోజిచ్చింది పూజా. ఇంకేముంది కొద్దిసేపట్లోనే ఆ ఫోటోకు బోలెడు లైకులు, షేర్లు. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సీనియాలో, ప్రభాస్, రాధాకృష్ణలు చేస్తున్న చిత్రంలో కథానాయకిగా చేస్తోంది. ఈ రెండూ కాక హిందీలో కూడా ఒక సినిమా చేస్తోంది పూజా.

బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌

బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌

AP &Telangana, Business, Education, Festivals, HOROSCOPE, National, Politics
బడ్జెట్‌: చిల్లర వ్యాపారులకు పింఛన్‌ చిల్లర వ్యాపారుల కోసం 'ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన' పేరుతో కొత్త పథకం ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ ఆమె లోక్‌సభలో ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంగా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం తీసుకువస్తామని చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 2.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆమె చెప్పారు. 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యమని తెలిపారు. జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారన్న ఆమె.. ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. శక్తివంతమైన దేశం కావాలంటే..శక్తివంతమైన పౌరులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

రివ్యూ: ఓ బేబీ

రివ్యూ: ఓ బేబీ

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, viral videos
 రివ్యూ: ఓ బేబీ రివ్యూ: ఓ బేబీ జూలై 5, 2019 రివ్యూ: ఓ బేబీ నటీనటులు: సమంత, లక్ష్మి, నాగసౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, ప్రగతి తదితరులు మ్యూజిక్: మిక్కీ జే మేయర్ ఫోటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్ నిర్మాత: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా దర్శకత్వం: నందిని రెడ్డి సమంత హీరోయిన్ గా చేసిన ఓ బేబీ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్. ఈ సినిమాపై అనేక అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉన్నదా లేదా తెలుసుకుందాం. కథ: లక్ష్మి చిన్నవయసులోనే పెళ్లి జరుగుతుంది. యుక్తవయసులోకి రాగానే భర్తను కోల్పోతుంది. పెద్దవయసు వచ్చాక తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటుంది. కానీ, తన పెద్దవయసు ప్రవర్తన వలన, అతి ప్రేమ వలన ఆమెను అక్కడ ఉంచితే పిల్లలు కూడా అలాగే మారిపోతారేమో అనుకోని ఆమెను తీసుకెళ్లి ఓ వృద్దాశ్రమంలో ఉంచుతారు. దీంతో ఆమెలో ఆమె మదనపడుత

సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది…!!

సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది…!!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Technology, viral videos
సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది...!! ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది. కొద్దిసేపటికి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. అల్ట్రా ఎలెక్ట్రిక్ మ్యూజిక్ తో అదిరిపోయింది. జస్ట్ 28 సెకన్ల నిడివికలిగిన ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. జులై 8 వ తేదీన ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ రోజుకొక్కటి చొప్పున రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది. పోస్టర్లు, ఫోటోలు, సింగిల్స్ టీజర్, సింగిల్స్ ను రిలీజ్ వరసగా రిలీజ్ చేస్తారట. ఆడియో, ప్రీ రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు. https://youtu.be/1jDRlTZB1Lc

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌

Education, International, National, Politics, Sports, viral videos
వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ప్రపంచకప్‌లో మరో పోరుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లకూ సెమీస్‌ ఆశలు గల్లంతవడంతో ఇది నామమాత్రపు మ్యాచ్‌గానే మిగలనుంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో, విండీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ జట్టు: గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హిట్మెయిర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫాబియన్ ఆలెన్, షెల్డన్ కాట్రెల్, థామస్, షానూన్ గాబ్రియేల్ శ్రీలంక జట్టు: కరుణరత్నే, కౌశల్ పెరెరా, ఫెర్నాండో, కుశల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, జెఫ్రీ వండెర్సే, కసున్ రజిత, మలింగ

ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌

Business, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Sports, viral videos
ప్రపంచకప్‌ నుంచి విజయ్‌శంకర్‌ ఔట్‌ అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ లండన్‌: ప్రపంచకప్‌ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ తప్పుకొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తుండగా విజయ్‌శంకర్‌ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతడు ప్రపంచకప్‌లో కొనసాగడం కష్టంగా ఉందని, స్వదేశానికి తిరిగొస్తాడని అధికారి తెలిపారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేసిందని అన్నారు. కాగా మయాంక్‌ అగర్వాల్‌ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడి ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయ్‌శంకర్‌కి బదులు రిషభ్‌పంత్‌ను ఆడించింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత

కట్టుదిట్టమైన భద్రత మధ్య ‘అమర్‌నాథ్‌’ యాత్ర..

కట్టుదిట్టమైన భద్రత మధ్య ‘అమర్‌నాథ్‌’ యాత్ర..

Business, Education, Festivals, HOROSCOPE, local, National, Politics, viral videos
కట్టుదిట్టమైన భద్రత మధ్య 'అమర్‌నాథ్‌' యాత్ర.. గత అనుభవాలు, ఈసారి 'అమర్‌నాథ్‌' యాత్రను మళ్లీ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన భద్రతతో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు అనంత్ నాగ్ జిల్లా అభివృద్ధి విభాగం కమిషనర్ ఖలీద్ జహంగీర్ ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించారు. నిన్న జమ్ము బేస్ క్యాంపు నుంచి బయల్దేరిన యాత్రికులు ఇవాళ బల్లాల్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను ప్రారంభించారు. తొలి విడుతలో 2,234 మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు బయల్దేరగా.. 46 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది 1.5లక్షల మంది భక్తులు అమర్ నాథ్ యాత్ర చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక, నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ సారి 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక

కొండెక్కిన కొత్తిమీర‌.. చికెన్ ధ‌ర‌లు

కొండెక్కిన కొత్తిమీర‌.. చికెన్ ధ‌ర‌లు

AP &Telangana, Business, Education, HOROSCOPE, local, National, viral videos
కొండెక్కిన కొత్తిమీర‌.. చికెన్ ధ‌ర‌లు సామాన్యుడికి అందని ఎత్తులో కూరగాయల ధరలు ఆత్మకూరు పట్టణం, సంతమార్కెట్‌లో ఆదివారం కూడా కూరగాయల ధరలు మండిపోయాయి. వర్షాలు కురవటం ప్రారంభమైనా పంటల దిగుబడి లేదు. అరకొరగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు పంట పొలాల్లో విత్తనాలు వేయటం ప్రారంభించారు. ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయ పంటల సాగు మొదలు పెట్టారు. పంటల దిగుబడి లేకపోవటం, దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో కూరగాయల ధరలు ఇంకా తగ్గలేదు. సామాన్యుడు, సగటు కూలీ మనిషి కూరగాయలను కొనుగోలు చేయాలంటే భయాందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో కొత్తిమీర, అల్లానికి విపరీతమైన డిమాండు ఉంది. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవటంతో కోడి మాంసం ధరకు రెక్కలొచ్చాయి. కిలో కోడి మాంసం రూ.240కు చేరింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కొనుగోలుదారులు, వ్యాపారులు అవస్థలుపడ్డారు. కొత్తిమీరకు భలే గిరాకీ భారతీయ వంటకాల్లో కొత్తిమీర తప్పని

మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం

మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం

AP &Telangana, Crime, Education, Festivals, HOROSCOPE, local, National, Politics, viral videos
మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం కుమురం భీం జిల్లా కొత్త సార్సాలలో ఘటన అటవీ రేంజ్‌ అధికారిపై కర్రలతో దాడి అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ కృష్ణారావు అరెస్టు వైస్‌ఛైర్మన్‌ పదవి సహా జడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా పోలీసుల ఉదాసీనతపై డీజీపీ మండిపాటు డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్‌ వేటు ఆసిఫాబాద్‌ సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు ఆదివారం ఓ మహిళా అటవీ అధికారిపై కర్రలతో దాడికి తెగబడడం సంచలనం సృష్టించింది. జడ్పీ వైస్‌ఛైర్మన్‌ కూడా అయిన కృష్ణారావు దాష్టీకానికి అటవీ రేంజ్‌ అధికారి అనిత తలకు, చేతులకు గాయాలయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చేపట్టిన మొక